టీడీపీకి ఓటేసి మోసపోయాం

తూర్పుగోదావరి))

ముమ్మిడివరం నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలొ కాట్రేనికోన మండలం లక్ష్మివాడ పంచాయతీలో రెండొవ రోజు గడప గడపకు వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి బాబు మోసపూరిత హామీలను వివరించి  ప్రజలకు ప్రజాబ్యాలెట్ అందజేశారు. కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని గ్రామస్తులు ఆరోపించారు. ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించడం లేదు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. రుణాలు మాఫీ చేయడం లేదు. మరుగుదొడ్లు, రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు, ఇంటి స్థలాలు ఏవీ ఇవ్వడం లేదని గ్రామస్తులు వాపోయారు. చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మి ఓటేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు మారకుంటే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పితాని బాలకృష్ణ పాలకులను హెచ్చరించారు.


Back to Top