రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది

కమీష‌న్ల కోస‌మే ప్ర‌త్యేక ప్యాకేజీ
కొలిమిగుండ్ల‌: క‌మీష‌న్ల కోస‌మే టీడీపీ నాయ‌కులు ప్ర‌త్యేక ప్యాకేజీని ఒప్పుకున్నార‌ని వైయ‌స్సార్‌సీపీ బ‌నగాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కాట‌సాని రామిరెడ్డి అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న కొలిమిగుండ్ల గ్రామంలో ప‌ర్య‌టించి చంద్ర‌బాబు మోస‌పూరిత హామీల‌ను ప్రజలకు వివరించారు. అంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందాలంటే వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

రాష్ట్రంలో అరాచ‌క పాల‌న కొన‌సాగుతుంది
న‌ర్సీప‌ట్నం:  ఏ గ‌డ‌ప కెళ్లినా... ఏ వ్య‌క్తిని ప‌ల‌క‌రించినా... ఒకే మాట టీడీపీ వ‌ల్ల నేను మోస‌పోయాయ‌ని, జీవితంలో బాబుకు ఓటు వేయ్య‌న‌ని అంటున్నార‌ని నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ఉమాశంక‌ర్ గ‌ణేష్ అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న గొలుగొండ మండ‌లం లింగ‌న్న‌దొర‌పాలెం పంచాయ‌తీలో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న కొన‌సాగుతుంద‌ని ఆయ‌న ఆరోపించారు. 

హామీలు అమలు చేసేవరకు
పి.గ‌న్న‌వ‌రం: రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా తీసుకువ‌స్తామ‌న్న హామీతో పాటు ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసేంత వ‌ర‌కు ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామని వైయ‌స్సార్‌సీపీ పి.గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ కొండేటి చిట్టిబాబు అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో  భాగంగా ఆయ‌న మండ‌ల ప‌రిధిలోని పాశ‌ర్ల‌పూడిలంక‌లో ప‌ర్య‌టించారు. ఇంటింటికీ తిరిగి ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ ఇచ్చిన హామీల‌ను ప్ర‌జ‌ల‌కు గుర్తు చేస్తూ,  క‌ర‌ప‌త్రాలు అంద‌జేసి మార్కులు వేయించారు. ఈసందర్భంగా బాబు పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Back to Top