అవినీతి, అక్రమాలే లక్ష్యంగా పాలన

టీడీపీ దోపిడీ పాల‌న‌
బ‌న‌గాన‌ప‌ల్లె(జిల్లెల్ల‌):  రాష్ట్రంలో టీడీపీ దోపిడీ పాల‌న సాగిస్తోంద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య‌క్షురు గౌరు వెంక‌ట‌రెడ్డి అన్నారు. వెంక‌ట‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం జిల్లెల్ల‌లో నిర్వ‌హించ‌గా, పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ కాట‌సాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ... టీడీపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల సంక్షేమాన్ని విస్మ‌రించి, కేవ‌లం అవినీతి, అక్ర‌మాల‌నే ల‌క్ష్యంగా పెట్టుకుంద‌న్నారు.

నిరుద్యోగుల‌ను ద‌గా చేసిన టీడీపీ
పాణ్యం(క‌ల్లూరు):  ఎన్నిక‌ల హామీల‌ను తుంగ‌లో తొక్కేసి నిరుద్యోగుల‌ను ద‌గా చేసిన ప్ర‌భుత్వం టీడీపీ అని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చ‌రితారెడ్డి అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో చరితారెడ్డి ఆధ్వ‌ర్యంలో 19వ వార్డు గ‌ణేష్‌న‌గ‌ర్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం వంద ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేసి చంద్ర‌బాబు మోస‌పూరిత హామీల‌పై మార్కులు వేయించారు.

Back to Top