ప్రజల పక్షాన నిరంతర పోరాటం

బాబు మోసాలు ఇక చెల్ల‌వు
క‌ర్నూలు (క‌ల్లూరు): ఎన్నిక‌ల‌కు ముందు ఎడాపెడా హామీలిచ్చి ఆ త‌ర్వాత మాట మార్చిన చంద్ర‌బాబు మోసాలు ఇక చెల్ల‌వ‌ని వైయ‌స్సార్ సీపీ ఎమ్మెల్యే గౌరు చ‌రితారెడ్డి అన్నారు. గడ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆమె ప‌ట్ట‌ణంలోని 32వ వార్డులో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. మోస‌పూరిత హామీల‌పై చంద్ర‌బాబుకు త‌గిన బుద్ధి చెప్పాల‌ని చ‌రితారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. 

ప్ర‌జ‌ల కోసం నిరంత‌ర పోరాటం
శ్రీ‌శైలం(బండిఆత్మ‌కూరు):  వైయ‌స్సార్సీపీ  ఆవిర్భావం నుంచి ప్ర‌జ‌ల సంక్షేమం కోసం నిరంత‌రం పోరాడుతూనే ఉంద‌ని పార్టీ శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ బుడ్డా శేషారెడ్డి అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న ఎస్సీ కాల‌నీలో పర్య‌టించి చంద్ర‌బాబు మోసాల‌ను వివ‌రించారు. అనంత‌రం వంద ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేసి బాబు హామీల‌పై మార్కులు వేయించారు. 

మాఫీ వ‌డ్డీల‌కే స‌రిపోతోంది
తుగ్గ‌లి(ప‌త్తికొండ‌):  టీడీపీ ప్ర‌భుత్వం చేసిన రుణ‌మాఫీ వ‌డ్డీల‌కే స‌రిపోతోంద‌ని ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ సి.హెచ్‌. నారాయ‌ణ‌రెడ్డి అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న మండ‌ల ప‌రిధిలోని గిరిగెట్ల గ్రామంలో ప‌ర్య‌టించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ...ఎన్నిక‌లకు ముందు చంద్ర‌బాబు అమ‌లు గాని హామీల‌ు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను న‌ట్టేటా ముంచార‌ని మండిప‌డ్డారు. 

Back to Top