టీడీపీ నాయకులను నిలదీయండి

బనగానపల్లె రూరల్‌: ప్రజా సమస్యల పరిష్కారంలో స్థానిక ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి విఫలమయ్యారని వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. సాదుకొట్టం, మాదాసుపల్లెలో బుధవారం గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమం చేపట్టారు. దద్దణాల ప్రాజక్టుకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు తన హయాంలో జరిగిందని అయితే సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో ఆగిపోయిందన్నారు. పాతపాడు సమీపంలో పర్కులేషన్‌ ట్యాంకు నిర్మాణానికి రూ. 3.19 కోట్ల నిధులు అప్పట్లోనే మంజూరు చేయించానని, టెండర్‌ తన కుటుంబసభ్యులకు దక్కిందన్న అక్కసుతో ఎమ్మెల్యే పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పర్కులేషన్‌ ట్యాంకు పూర్తయితే పాతపాడు, సాదుకొట్టం, మాదసుపల్లె, మీరాపురంంలో భూగర్భ జలాలు పెరిగి నీటి సమస్య తీరుతుందని పేర్కొన్నారు. 


పత్తికొండ: ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం నెరవేర్చలేదని స్థానికులు పేర్కొన్నారు. గడపగడపకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి మండల పరిధిలోని హోసూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలు నారాయణరెడ్డికి వివరించారు. పక్కా గృహాలు మంజూరు కాలేదని, వికలాంగులకిచ్చే పింఛన్‌ రావడం లేదని, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఊసేలేదని పేర్కొన్నారు. మరుగుదొడ్లు కట్టిస్తామంటూ వచ్చిన వెళ్లిన వారు తిరిగి చూడలేదంటూ స్థానికులు వాపోయారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఎన్నికల హామీలను ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. జనచైతన్య యాత్రల పేరుతో జనం వద్దకు వస్తున్న టీడీపీ నాయకులను నిలదీయాలని సూచించారు. 

Back to Top