హామీల అమలులో పూర్తిగా విఫలం

బాబుకు ఓట్లేసి మోస‌పోయాం
ప‌త్తికొండ‌: ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ ఇచ్చిన హామీలు ఏవీ అమ‌లు కావ‌డం లేద‌ని, చంద్ర‌బాబు మోసం చేశాడ‌ని మ‌హిళ‌లు, యువ‌కులు, వృధ్ధులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా వైయ‌స్సార్సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయ‌ణ‌రెడ్డి ప‌ట్ట‌ణంలో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఏ గ‌డ‌ప‌కూ వెళ్లినా.. ఏ మ‌నిషిని ప‌ల‌క‌రించినా స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని, ప్ర‌జా సంక్షేమాన్ని అధికార ప్ర‌భుత్వం పూర్తిగా విస్మ‌రించింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 


ఇంటింటా స‌మ‌స్య‌ల వెల్లువ‌
ముమ్మిడివరం(కాట్రెనికొన): ప‌ల్లంకుర్రు గ్రామంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై వైయ‌స్సార్‌సీపీ చేప‌ట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో స‌మ‌స్య‌లు వెల్లువెత్తాయి. ప‌ల్లంకుర్రు శివారు మొక్క‌ల‌తిప్ప గ్రామంలో పార్టీ మండ‌ల క‌న్వీన‌ర్ విత్త‌నాల వెంక‌ట‌ర‌మ‌ణ ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం కొన‌సాగింది. అనంత‌రం ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు చేస్తున్న మోసాల‌ను వివ‌రిస్తూ వంద‌ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేసి, బాబు పాల‌న‌పై మార్కులు వేయించారు. 

మోస‌గాడిగా మిగిలిపోయిన చంద్ర‌బాబు
విశాఖ‌ప‌ట్నం(ఎన్ఏడీ జంక్ష‌న్‌): ఎన్నిక‌ల హామీలు నెర‌వేర్చ‌మ‌ని అడుగుతున్నాం.... ఇది మ‌న హ‌క్కు అని వైయ‌స్సార్ సీపీ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య క‌ర్త మ‌ళ్ల విజ‌య‌ప్ర‌సాద్ అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయన స్థానిక 67వ వార్డులో ప‌ర్య‌టించారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల వ‌ల్లే గెలిచిన చంద్ర‌బాబు, వాటిని అమ‌లు ప‌ర్చ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని ఆయ‌న ఆరోపించారు.

తాజా ఫోటోలు

Back to Top