గుంటూరుః ప్రజాసమస్యలు పరిష్కరించడంలోనే గాకుండా అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని పొన్నూరు వైయస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణకు అన్నారు. పట్టణంలోని 20 వార్డులో వెంకటరమణ గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గడపగడపకూ కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఏ గడపలో చూసినా అన్నీ సమస్యలేనని, తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో మోసకారి టీడీపీకి తమ సత్తా ఏంటో చూపిస్తామని పట్టణవాసులు అంటున్నారని పేర్కొన్నారు. కనీస సౌకర్యాలు కూడా ఈ ప్రభుత్వం కల్పించడం లేదని మండిపడ్డారు. <br/><br/>