ప్లెక్స్‌ల ధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు

మామిడికుదురు: గడప గడపకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పి.గన్నవరం కో–ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు, మండల శాఖ అధ్యక్షుడు బొలిశెట్టి భగవాన్, నాయకులు తోరం సూర్యభాస్కర్, జక్కంపూడి వాసు, తదితరులు నగరం ఎస్‌ఐ జి.వెంకటేశ్వరరావును కలిశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఇతర పార్టీలకు చెందిన ప్లెక్స్‌లు కూడా గ్రామంలో ఉన్నా.. వాటికి ఏ విధమైన నష్టం కలగించలేదని, కేవలం వైయస్‌ఆర్‌సీపీకి చెందిన ప్లెక్స్‌లు మాత్రమే ధ్వంసం చేశారన్నారు. గతంలో కూడా ఇదే తరహాలో ప్లెక్స్‌లను ధ్వంసం చేశారని గుర్తు చేశారు. ప్లెక్స్‌లను ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు యూవీవీ సత్యనారాయణ, ఎండీవై షరీఫ్, గెద్దాడ నాగరాజు, మట్టపర్తి శివ, పినిశెట్టి శేఖర్, అన్వర్‌ తాహిర్‌ హుస్సేన్, అక్బర్‌ హుస్సేన్, కొండేటి వెంకటేశ్వరరావు, వికాష్, తదితరులు ఉన్నారు. 
Back to Top