బాబు పచ్చి మోసగాడు

ప్రకాశం జిల్లా(కొండేపి): పచ్చి అబద్ధాలతో ముఖ్యమంత్రి చంద్రతబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడని వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు ఆధ్వర్యరంలో జరిగిన గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమంంలో బాలినేని పాల్గొన్నారు. అశోక్‌బాబుతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసిన బాలినేని ప్రభుత్వ మోసపూరిత హామీల గురించి గ్రామ ప్రజలకు వివరించారు. రాజన్న రాజ్యం రావాలంటే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళలు తమకు ఇళ్లు, రేషన్‌ కార్డులు, పింఛన్లు అందడం లేదని ఆయన ఎదుట వాపోయారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బొట్ల రామారావు, డాకా పిచ్చిరెడ్డి, ఆనం సత్యనారాయణరెడ్డి, గాలి సుబ్బరాయుడు, మన్నం కోటేశ్వరరావు పాల్గొన్నారు. 

ప్రత్తిపాడు(రౌతులపూడి): వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో గిడజాంలో రెండో విడత గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎస్సీపేటలోని అంబేడ్కర్, దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన గ్రామంలో ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం ఆరున్నర గంటల వరకు సాగిన కార్యక్రమంలో సుమారు 300 ఇళ్లు తిరిగారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను చంద్రప్రసాద్ ప్రజలకు వివరించారు. 

Back to Top