ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి

కర్నూలు(ఆలూరు))ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. దేవనకొండ మండలంలోని వెంకటాపురం, బుర్రకుంట, గద్దెరాళ్ల గ్రామాలాల్లో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని అర్హతలున్నా పింఛన్లు ఇవ్వడం లేదని వృద్ధులు, వికలాంగులు ఎమ్మెల్యే వద్ద వాపోయారు. సీసీ రోడ్లు, తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని,  కరువుతో వలస బాట పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ...ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గాలిమర్లలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించి న్యాయం చేయాలని ప్రైవేటు కంపెనీలను కోరారు. మండలాన్ని కరువు జాబితాలో చేర్చి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 


Back to Top