మోసం చేయడమే బాబు నైజం

తూర్పుగోదావరి(జగ్గంపేట))గోకవరం మండలం రంపయర్రపాలెం గ్రామంలో ఐదో రోజు గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగింది. జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ గడపగడపలో పర్యటించి టీడీపీ సర్కార్ మోసాలను ఎండగట్టారు. ఈసందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను శ్రీనివాస్ వద్ద మొరపెట్టుకున్నారు. బాబుకు ఓట్లు వేసి మోసపోయామని వాపోయారు. నమ్మిన వారిని మోసం చేయడంలో బాబును మించిన వారెవరూ లేరని ముత్యాల శ్రీనివాస్ అన్నారు. ప్రజల కష్టాలు తీరాలంటే రానున్న కాలంలో వైయస్సార్సీపీకి మద్దతు పలికి, వైయస్ జగన్ ను సీఎం చేయాలని ప్రజలను కోరారు. 


Back to Top