అబద్ధపు హామీలతో నయవంచన

బాబుకు బుద్ధి చెబుతాం..!
తూర్పుగోదావరి(ముమ్మిడివరం))అబద్దపు హామీలతో చంద్రబాబు తమను వంచించారని మండలంలోని అనాతవరం గ్రామస్తులు ధ్వజమెత్తారు.  రాబోయే ఎన్నికల్లో బాబుకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వైయస్సార్‌ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో ముమ్మడివరం మండలం అనాతవరం శివారు వడ్డివారిపేట, మహిపాల చెరువు ప్రాంతాలలో గడపగడపకు వైయస్సార్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.  డ్రైనేజీకి సౌకర్యం లేక మురుగునీరు ఇళ్ల ముందుకు చేరుతోంది. రోడ్లు అధ్వాన్నంగా మారాయి. ఇళ్లు లేవు.  మంచినీటి సరఫరా సక్రమంగా జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. బాబు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా ఏ ఒక్కటీ చేయడం లేదని గ్రామస్తులు మండిపడ్డారు. 

ఒక్క ఇళ్లూ మంజూరు చేయలేదు
విజ‌య‌న‌గ‌రం(చెల్లెంపేట‌/బ‌లిజిపేట‌):  గ్రామంలో ఉన్నామా... అర‌ణ్యంలో నివ‌సిస్తున్నామా... అన్న‌ట్టుంద‌ని చెల్లెంపేట గ్రామ‌స్తులు వాపోయారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా వైయ‌స్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త జమ్మాన ప్ర‌స‌న్న‌కుమార్ చెల్లెంపేట‌లో పర్యటించారు. దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వంలో వ‌చ్చిన ఇళ్లు త‌ప్ప కొత్త‌వి ఒక్కటి కూడా మంజూరు కాలేద‌ని సుశీల‌, పైడ‌మ్మ‌, వి.న‌ర‌స‌మ్మ‌, కె.సూరీడులు ఆయ‌న దృష్టికి తీసుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ... మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి వంచించిన బాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top