నిలువెల్లా దగా

ఎమ్మిగ‌నూరుః కర్నూలు జిల్లా ఎమిగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని గోనెగండ్ల మండ‌లం ఐర‌న్‌బండ గ్రామంలో నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ఇన్‌చార్జ్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆధ్వర్యంలో గ‌డ‌ప గ‌డ‌పకూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలోని ప్ర‌తీ ఇంటికి తిరుగుతూ చంద్ర‌బాబు అవినీతి, అక్ర‌మ ప‌రిపాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. ఎన్నిక‌ల ముందు వంద‌ల కొద్ది హామీలు ఇచ్చి  అవి నెరవేర్చకుండా ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన తీరును ఎండగట్టారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నేత‌లు అధిక సంఖ్య‌లో పాల్గొన్నారు.


Back to Top