కొల్లేటి ప్రజలను నట్టేట ముంచారు

కృష్ణా(కైకలూరు))మండవల్లి మండలం చింతపాడు గ్రామంలో కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కన్వీనర్ గుమ్మడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 86వ రోజు కార్యక్రమం కొనసాగింది. ఈసందర్భంగా  డీఎన్నార్ మాట్లాడుతూ...ప్రభుత్వం కొల్లేటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా నట్టేట ముంచిందని మండిపడ్డారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, తాగునీరు లేక అల్లాడుతున్నామని స్థానిక సమస్యలను ప్రజలు డీఎన్నార్ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Back to Top