చంద్రన్న బీమా బూటకం

ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి
పాలకొండ: చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకం బూటకమని ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి విమర్శించారు. జ్వరంతో బాధపడుతూ నాలుగు నెలల క్రితం నలుగురు మృతిచెందితే చంద్రన్నబీమా పరిహారం ఇంతవరకు అందలేదని ధ్వజమెత్తారు. గురువారం గడపగడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం పెద్దముత్యాలు, ఎ్రరన్నగూడ గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్బంగా గిరిజనులు పలు సమస్యలు ఎమ్మెల్యేకు విన్నవించారు. గ్రామానికి ప్రధాన రహదారితో పాటు  సీసీ రహదారి రెండు వీధులకు వేయాల్సి ఉందన్నారు.  పైనాపిల్‌ విస్తరణ పథకంలో నిధులు అరకొర మంజూరు చేశారని తెలిపారు. అన్ని గ్రామాల్లో ఒక్కో రైతుకు ఎకరాకు రూ.12 వేలు వరకు వస్తే మా గ్రామంలో కేవలం రూ.2 నుంచి 3 వేలు  మాత్రమే వచ్చాయని గిరిజనులు ఆవేదన చెందారు. వరదగోడ లేకపోవడంతో వర్షాలు వస్తే  వర్షపు నీరు గ్రామంలోకి వచ్చేస్తుందని తెలిపారు. తమకు ఇళ్లబిల్లులు కూడా మంజూరు కాలేదని సవర సాయమ్మ, బూదమ్మ, మంగమ్మ, తదితరులు వాపోయారు.మొత్తం 17 మందికి ఇళ్ల బిల్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దివ్యాంగుడైన బాబురావు తనకు ట్రైసైకిల్‌ ఇప్పించాలని తెలిపారు. గ్రావిటేషన్‌ ఫ్లో మంజూరైనా పనులు ప్రారంభించలేదన్నారు. ఎ్రరన్నగూడలో బావి మరమ్మత్తులు చేయాలన్నారు.సోలార్‌ రక్షిత పథకం ఏర్పాటు చేయించాలని కోరారు. ఈ గ్రామంలో 9 మందికి ఇళ్ల బిల్లులు చెల్లించలేదని పలువురు గిరిజనులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎస్‌.లక్ష్మి,పార్టీ మహిళా కన్వినర్‌ ఆరిక కళావతి, సోమగండి సర్పంచ్‌ ఎస్‌.గోపాలు,  పీసాచట్టం ఉపాద్యక్షుడు నిమ్మక సోమయ్య,పార్టీ నేతలు గొర్లె ప్రకాష్, ఎస్‌.చంద్రశేఖర్, కుమార్, కృష్ణ, ఎస్‌.రమేష్, ఎ.గణేష్, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top