చంద్రబాబు మోసాలు తేటతెల్లమయ్యాయి

 బాబు కు ప్ర‌జ‌లే బుద్ధి చెబుతారు
మంత్రాల‌యం))
చంద్ర‌బాబువి మాటలే తప్ప చేతలు శూన్యమని మంత్రాల‌యం నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే బాల‌నాగిరెడ్డి అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న పెద్ద‌క‌డ్బూర్ మండ‌లం, చిన్నాటుమ్మ‌ల‌మ్, బాపుర‌మ్ గ్రామాల్లో ప‌ర్య‌టించారు. ప్రతీ ఒక్కరూ  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని అమితంగా ఆద‌రిస్తున్నార‌ని, వైయ‌స్ జ‌గ‌న్ సీయం కావాల‌ని  కోరుకుంటున్నార‌ని ఆయ‌న తెలిపారు. ప్రజల ప‌క్షాన నిలిచి, ప్ర‌భుత్వ మెడ‌లు వంచిన పార్టీగా వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర ప్రజల మ‌న్న‌నల‌ు పొందుతోందని ఆయ‌న తెలిపారు.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి రోజులు చెల్లాయ్...
ఎమ్మిగ‌నూరు))
చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి నూకలు చెల్లాయని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మిగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. చంద్ర‌బాబు ఎందాకా చైనా, జ‌పాన్ అంటూ విదేశాలు తిరుగుతూ రాష్ట్రాన్ని గాలికదొలేశారని ఆయన మండిపడ్డారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న నంద‌వ‌రం మండ‌లంలో ప‌ర్య‌టించారు. చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌న్నీ ఎగ్గొట్టారు గ‌నుకే విదేశాలో తిరుగుతూ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మొహం చాటేస్తున్నారని ఆయ‌న విమ‌ర్శంచారు. చంద్ర‌బాబు  రాష్ట్రాన్ని విదేశాల పాలు చేస్తున్నారని ఆగ్రహించారు. 

ప్ర‌జ‌ల గుండెలో వైయ‌స్ఆర్ సీపీ..
కోడుమూరు))
 ప్రజల ఆదరణతో ముందుకు గడపగడపకూ వైయస్సార్సీపీ దూసుకుపోతోందని కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జి ముర‌ళీ కృష్ణ అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న గూడూరు మండ‌లం, బి.నాగ‌లాపురం లో ప‌ర్య‌టించారు. వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌జా నాయ‌కుడ‌ని, ప్ర‌జ‌లు ఆయ‌న‌కు రానున్న ఎన్నికల్లో ప‌ట్టం క‌ట్టడం ఖాయమని చెప్పారు.  చంద్ర‌బాబు మోసాలు అంద‌రికీ తేట‌తెల్ల‌మయ్యాయ‌ని, త్వ‌ర‌లోనే ఆయ‌న‌కు ప్ర‌జ‌లు త‌గిన బుద్ధి చెబుతార‌ని మురళీ కృష్ణ అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం ఈ నెల 26తో, యాబై రోజులు పూర్తి చేసుకుంటుంద‌ని తెలిపారు.

Back to Top