రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తోంది

కర్నూలు జిల్లాః బనగానపల్లె నియోజకవర్గం 1వ వార్డ్ NGO’S కాలనీ , పంచామపేట కాలనీలలో వైయస్సార్సీపీ ఇంచార్జ్ కాటసాని రామిరెడ్డి గడప గడప కు వైయస్సార్ కార్యక్రమాన్నినిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆహ్వానం  పలికారు. అనంతరం పట్టణం లోని ప్రతి గడప కు వెళ్లి చంద్రబాబు మోసపూరిత హామీలపై కరపత్రాలు పంపిణీ చేశారు. కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.... రాష్ట్రంలో ఎక్కడ చుసిన అవినీతి విలయ తాండవం చేస్తుందని ....తెలుగు తమ్ముళ్లు విచ్చలవిడిగా రాష్ట్రాన్న దోచుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు –చెట్టు పథకం ద్వార పేద ప్రజల డబ్బు తెలుగు తమ్ముళ్ళ జేబుల్లోకి వెళుతున్నాయి అని విమర్శించారు.  తమ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్య మంత్రి అయిన వెంటనే విజిలెన్స్ విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. 

కళ్ళు ,కాళ్ళు లేని వికలాంగులకు పింఛన్ లు మంజూరు చేయడంలో రాజకీయ వివక్ష చూపెట్టడం  మంచి పద్ధతి కాదని హచ్చరించారు. చంద్ర బాబు నాయుడు అధికారం చేపట్టి  మూడు సంవత్సరాలు  అవుతున్న అటు వర్తకులకు ,రైతులకు,నిరుద్యోగులకు , మహిళలకు ఎవరికి కూడా  ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగ అమలు చేయలేకపోవడంపై మండిపడ్డారు. అన్నివర్గాల ప్రజలు చంద్రబాబు నాయుడుకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అవుతారు.  పేద ప్రజల కష్టాలు తీరుతాయి అని చెప్పారు. న్నికలు ఎప్పుడు వచ్చిన వైయస్సార్సీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు .
 
Back to Top