రాష్ట్రాన్ని దోచుకుతింటున్న చంద్ర‌బాబు

తిరుప‌తిః అలీబాబా 40 దొంగ‌ల్లా టీడీపీ నేత‌లు రాష్ట్రం మీద ప‌డి దోచుకుతింటున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి విమ‌ర్శించారు. చిత్తూరు జిల్లా తిరుప‌తిలో భూమ‌న గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స్థానిక మ‌హిళామ‌ణులు భూమ‌న‌కు పెద్ద ఎత్తున హార‌తులు ప‌ట్టి స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి దోచుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని ఆరోపించారు. రాజ‌ధాని పేరు చెప్పి రైతుల నుంచి అన్యాయంగా భూములు లాక్కొని విదేశాల‌తో రియ‌లెస్టేట్ వ్యాపారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. త‌ప్పుడు ఆస్తుల‌ను ప్ర‌క‌టిస్తూ ప్ర‌జ‌లను మోసం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాబోయే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అవినీతి ప‌రిపాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేసుకుంటే (వైయ‌స్ఆర్) రాజ‌న్న రాజ్యం మ‌ళ్లి తిరిగొస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. భూమ‌న వెంట పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.


Back to Top