అబద్ధాలతో చంద్రబాబు పాలన

నెల్లూరు: సీఎం చంద్రబాబు అబద్ధాలతో పరిపాలన చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. కోవూరు నియోజకవర్గ పరిధిలోని బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగులో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల గృహాల విషయంలో చంద్రబాబు అబద్ధాలు మాట్లాడుతున్నారని, పాత ఇళ్లనే కొత్తగా చేసి చూపుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు మూడున్నరేళ్ల పరిపాలనలో ఒక్క ఇల్లు కట్టించిన పాపాన పోలేదన్నారు. 

Back to Top