ప‌బ్లిసిటీ పిచ్చితో ముందుకుపోతున్న బాబు

క‌ర్నూలుః ప‌రిపాల‌న గాలికొదిలేసి ప‌బ్లిసిటీ పిచ్చితో చంద్ర‌బాబు ముందుకు వెళ్తున్నాడ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త బుడ్డా శేషారెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని వెలుగోడు ప‌ట్ట‌ణంలోని వార్డు నెంబ‌ర్ 19లో శేషారెడ్డి ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇంటింటికీ తిరుగుతూ చంద్ర‌బాబు మోసాల‌ను ఎండ‌గ‌ట్టారు. అనంత‌రం ప్ర‌జాబ్యాలెట్‌ను స్థానిక ప్ర‌జ‌ల‌కు అందించారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. 

Back to Top