చంద్రబాబు ఒక రాజకీయ వ్యభిచారి

చిట్టమూరు: చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మర్లాంలో సోమవారం జరిగిన గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులకు ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. 22 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు ఒక రాజకీయ వ్యభిచారి అని పార్టీ ప్రధాన కార్యదర్వి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులను అంగడి సరకుల్లా కొనుగోలు చేసిన చంద్రబాబు ఒక అసమర్థ ముఖ్యమంత్రి అని ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యే సంజీవయ్య, గూడూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరిగ మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top