ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసిన చంద్రబాబు


- ఎన్నికల హామీలు విస్మరించిన బాబుపై ప్రజాగ్రహం
- గడపగడపకూ వైయ‌స్సార్ కార్యక్రమానికి మంచి స్పందన
- పార్టీ నేతలకు సమస్యలు మొరపెట్టుకుంటున్న ప్రజలు

ప్ర‌కాశం జిల్లా) అర్హత ఉన్నా పింఛన్లు అందక వృద్ధులు.. మాఫీ అవుతాయనుకున్న రుణాలు చెల్లించలేక రైతులు.. పూరి గుడెసెలో నివాసం ఉంటున్నాం పక్కా ఇళ్లు మంజూరు కాలేదని పేదలు.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. గడపగడపకూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా తమ ఇళ్లకు వచ్చిన ఆ పార్టీ నాయకులకు ప్రజలు సమస్యలు ఏకరువు పెడుతున్నారు.  టీడీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 గడపగడపకూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన పార్టీ శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రజల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలుకరించారు.  వైయ‌స్సార్ కాంగ్రెస్‌ పార్టీకి ప్రతి ఒక్కరూ మద్దతు పలికి చంద్రబాబు అరాచక పాలనకు చరమ గీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని సీఎం చేయడం ద్వారా రాజన్న పాలన తిరిగి తెచ్చుకుందామని చెప్పారు. 

మార్కాపురం మండలంలోని తిప్పాయిపాలెంలో స్థానిక ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పర్యటించారు. వేటపాలెం మండలం దేశాయిపేటలో చీరాల నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ, బాపట్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జి వరికూటి అమృతపాణిలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకొల్లు మండలం కొణికిలో పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి భరత్, మర్రిపూడి మండలం వల్లాయిపాలెం గ్రామంలో కార్యక్రమంలో కొండపి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు పాల్గొన్నారు. కంభం మండలం రావిపాడులో గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి పర్యటించారు.
Back to Top