బాబు.. భూ కబ్జాల నాయుడు


- హామీల‌ను మ‌ర‌చిన సీఎం
-ప్ర‌జ‌లు ఎన్నిక‌ల్లో త‌ప్ప‌క బుద్ధి చెబుతారు
-నెల్లూరు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పి. అనిల్‌కుమార్ యాదవ్
 నెల్లూరు))  ఎన్నిక‌ల ముందు ప్ర‌తి పేద‌వాడికి 18 అంక‌ణాల స్థ‌లంతో పాటు ఇళ్ళు నిర్మించి ఇస్తామ‌ని హామీ ఇచ్చిన చంద్ర‌బాబు గెలిచిన త‌ర్వాత మాట మ‌రిచాడ‌ని నెల్లూరు ఎమ్మెల్యే పి. అనిల్‌కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు.  గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మంలో భాగంగా నెల్లూరులోని రాజాగారి వీధి, రావిచెట్టు సెంట‌ర్‌, చామండివారి తోట‌, బెస్త‌పాళెం, రొట్టెల‌వీధి లో ప‌ర్య‌టించారు. పేద‌లు ఇళ్ల స్థ‌లాల కోసం క‌లెక్ట‌ర్‌, త‌హ‌సీల్దారు కార్యాల‌యాల చుట్టూ తిరుగుతుంటే...టీడీపీ పార్టీ మాత్రం ప్ర‌తి జాల్లాలోనూ ఖ‌రీదైన ప్రాంతాల‌లో రెండెక‌రాల చొప్పున దోచుకొంటోంద‌ని ధ్వజమెత్తారు. రాజ‌ధాని పేరిట రైతుల‌కు తీర‌ని అన్యాయం చేసి బాబు విదేశాల‌లో జ‌ల్సాలు చేస్తున్నార‌ని దుయబట్టారు. పార్టీ కార్యాల‌యాల పేరిట భూములు దోచుకోవడం తగదని బాబును హెచ్చ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ యువ‌జ‌న విభాగం జిల్లా అధ్య‌క్షులు పి. రూప్‌కుమార్ యాద‌వ్‌, డిప్యూటీ మేయ‌ర్ ముక్కాల ద్వార‌క‌నాథ్, కార్పొరేట‌ర్లు గోగుల నాగ‌రాజు, ఎం.డి.ఖ‌లీల్ అహ్మ‌ద్, ఓబిలి ర‌విచంద్ర‌, ఊటుకూరు మాధ‌వ‌య్య, పార్టీ కార్య‌క‌ర్తలు పాల్గొన్నారు.Back to Top