ప్ర‌జా స‌మ‌స్య‌లు గాలికొదిలేసిన బాబు

శ్రీ‌కాకుళంః ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికొదిలి చంద్ర‌బాబు రాష్ట్రాన్ని విచ్చ‌లవిడిగా దోచుకుంటున్నాడ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ‌కాకుళం జిల్లా టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త పేరాడ తిల‌క్ విమ‌ర్శించారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ప‌లు గ్రామాల్లో తిల‌క్ ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గ్రామాల్లో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకొని, వాటి ప‌రిష్క‌రానికి కృషి చేస్తాన‌ని భ‌రోసా ఇచ్చారు. అనంత‌రం చంద్ర‌బాబు ఎన్నిక‌ల ముందు ఇచ్చిన వాగ్ధానాలు అమ‌ల‌య్యాయా అని స్థానికుల‌ను అడిగి తెలుసుకున్నారు. బాబు మోస‌పు  హామీల‌పై ప్ర‌చురించిన ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేసి వారితో మార్కులు వేయించారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top