ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు

ప్ర‌జా విశ్వాసం కోల్పోతున్న బాబు
న‌ర‌స‌న్న‌పేట‌: ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలను అమ‌లు చేయ‌ని అస‌మ‌ర్థ‌త సీఎం చంద్ర‌బాబు ప్ర‌జా విశ్వాసం కోల్పోతున్నార‌ని వైయస్సార్సీపీ  బీసీ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు ధర్మాన కృష్ణ‌దాస్ విమ‌ర్శించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న స్థానిక మేజ‌రు పంచాయ‌తీలోని బండివీధి, తెల‌గ‌వీధి, ర‌జిక వీధి, నెయ్యిల‌వీధుల్లో ప‌ర్య‌టించారు. ప్ర‌జ‌ల‌ను పూర్తిగా మోసం చేస్తూ బాబు  కాల‌క్షేపం చేస్తున్నార‌ని మండిపడ్డారు. 

బాబుది మోస‌పూరిత పాల‌న‌
తూర్పుగోదావ‌రి(గ‌న్న‌వ‌రం): ఎన్నిక‌ల స‌మ‌యంలోఇంటిరుణం ఇస్తాం, రుణ‌మాఫీ చేస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని ఎన్నో హామీలిచ్చి చంద్ర‌బాబు మోస‌గించార‌ని అయిన‌విల్లి మండ‌ల ప‌రిధిలోని వెల‌వ‌లప‌ల్లి గ్రామ‌స్తులు చంద్ర‌బాబు పాల‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా వైయ‌స్సార్‌సీపీ సీజీసీ స‌భ్యుడు కుడుపూడి చిట్టాబ్బాయి, పి. గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ కొండేటి చిట్టిబాబులు గ్రామంలో ప‌ర్య‌టించి చంద్ర‌బాబు మోస‌పూరిత పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు.

మ‌రుగుదొడ్ల పేరుతో మోసం
సూళ్ళూరుపేట‌(త‌డ‌):  టీడీపీ కౌన్సిల‌ర్ బుద్ధి విజ‌య‌ల‌క్ష్మి మ‌రుగుదొడ్ల నిర్మాణం పేరుతో అవినీతికి పాల్ప‌డ్డార‌ని ల‌బ్ధిదారులు ఆరోపించారు. ఈ మేర‌కు సూళ్లూరుపేటలోని ఇసుక‌మిట్ట‌లో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం ఎమ్మెల్యే కిలివేటి సంజీవ‌య్య ఆధ్వ‌ర్యంలో కొన‌సాగింది. వంద‌కు పైగా మ‌రుగుదొడ్లు మంజూరైతే అన్నీతాను క‌ట్టిస్తాన‌ని ప‌నులు చేప‌ట్టిన ఆమె ఒక్క‌దానిని కూడా పూర్తి చేయ‌లేద‌ని విజ‌య‌ల‌క్ష్మి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. 

తాజా ఫోటోలు

Back to Top