అనుభవాన్ని అవినీతికి ఉపయోగిస్తున్న చంద్రబాబు

విశాఖ‌ప‌ట్నంః త‌న‌కున్న అనుభ‌వాన్ని అభివృద్ధిపై పెట్ట‌కుండా ముఖ్య‌మంత్రి చంద‌్రబాబు అవినీతి,  భూదందాల‌కు ఉప‌యోగిస్తున్నాడ‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అర‌కు నియోజ‌క‌వ‌ర్గ క‌న్వీన‌ర్ శెట్టి పాల్గుణ విమ‌ర్శించారు. విశాఖ జిల్లా అర‌కు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని పేద‌బ‌య‌లు మండ‌లం గ‌ల‌గుండా పంచాయ‌తీ మంగ‌బంధ గ్రామంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఎన్నిక‌ల మోస‌పు హామీల‌పై ప్ర‌చురించిన ప్ర‌జాబ్యాలెట్‌ను స్థానికుల‌కు అంద‌జేసి టీడీపీ పాల‌న‌పై మార్కులు వేయించారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు చిన్న‌బ్బి, క‌ల్యాణ్‌, రాజ‌య్య‌,. దిలీప్‌కుమార్‌, దివాక‌ర్‌బాబు, ర‌వీంద్ర‌బాబు, రామ‌రాజు, పార్టీ జిల్లా, మండ‌ల నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top