రాష్ట్ర వనరులను దోచుకుంటున్న చంద్రబాబు

అనంతపురం: అనుభవం ఉన్న వ్యక్తి అని చంద్రబాబుకు ఓట్లేసి గెలిపిస్తే రాష్ట్ర వనరులను దోచుకుతింటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ విమర్శించారు. మూడేళ్ల పరిపాలనలో చంద్రబాబు రాష్ట్రానికి చేసింది సున్నా అన్నారు. తనకల్లు మండలం బొంతలపల్లి గ్రామంలో వైయస్‌ఆర్‌ సీపీ సమన్వయకర్త డాక్టర్‌ సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శంకర్‌నారాయణ హాజరై గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించారు. అనంతరం టీడీపీ మోసాలపై ప్రచురించిన ప్రజాబ్యాలెట్‌ను అందజేసి స్థానికులతో మార్కులు వేయించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Back to Top