ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్న చంద్ర‌బాబు

ప్ర‌కాశంః  ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో చంద్ర‌బాబు విఫ‌ల‌మ‌య్యాడ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త య‌డం బాలాజీ విమ‌ర్శించారు. ప్ర‌త్యేక విమానాల్లో విదేశాలు తిర‌ుగుతూ ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.  చీరాల మండ‌లం దేవాంగ‌పురి గ్రామ పంచాయ‌తీ అయోధ్య‌న‌గ‌ర్ 5, 6 వార్డుల్లో య‌డం బాలాజీ ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇంటింటికి తిరుగుతూ ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేసి బాబు పాల‌న‌పై మార్కులు వేయించారు. ప్ర‌జ‌ల‌ను త‌ప్పుడు వాగ్ధానాల‌తో మోసం చేసిన చంద్ర‌బాబుకు వారంతా సున్నా మార్కులే వేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు ల‌వ‌కుమార్‌, ప‌న్నెం దుర్గాప్ర‌సాద్‌, మ‌హేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top