ఏ ఒక్క హామీని నిలబెట్టుకోని చంద్రబాబు

తూ.గో.జిల్లాః  పి.గన్నవరం నియోజకవర్గం, అంబాజీపేట మండలం, ఇసుకపూడి గ్రామంలో కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు గడప గడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిట్టిబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. రెండున్నరేళ్లుగా చంద్రబాబు సాగిస్తున్న మోసపూరిత పాలనను చిట్టిబాబు ఇళ్లు ఇళ్లు తిరిగి ఎండగట్టారు. ప్రజాబ్యాలెట్ అందించి మార్కులు వేయాలని కోరారు. బాబు పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేని చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలని చిట్టిబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.తాజా ఫోటోలు

Back to Top