అభివృద్ది, సంక్షేమం అంతా బూటకం

– ఇంటింటికి వైయస్సార్‌ కుటుంబంలో ఎమ్మెల్యే
చిట్వేలి: తెలుగుదేశం పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రజాసంక్షేమం అంతా బూటకమని,  టాటా అడ్రస్సు ఎక్కడో అంతుచిక్కడంలేదని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. మండలంలోని మైలపల్లె, వడ్డెపల్లెల్లో ఇంటింటికి వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. వైయస్సార్‌ పాలనలో అన్ని అందాయని, ప్రస్తుత పాలనలో ప్రచార ఆర్భాటం తప్పా ఏమీ జరుగలేదని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. జగన్‌ పాలనకోసం తామంతా ఎదురుచూస్తున్నట్లు ప్రజలు అంటున్నారన్నారు. మూడేళ్ల పాలనలో ప్రజలకు ఏమి చేశారని ప్రస్తుతం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రజలను ప్రలోభపెట్టడం తెలుగుదేశంపార్టీ ఘనతగా ఎమ్మెల్యే కొరముట్ల అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ చెవ్వు శ్రీనివాసులరెడ్డి, రాష్ట్రకార్యవర్గ సభ్యుడు ఎం.వి.రమణ, లింగం లక్ష్మికర్, ప్రదీప్‌రెడ్డి, సుబ్రమణ్యం, బి.రమణారెడ్డి, నరసింహారెడ్డి, ప్రకాశం, మల్లికార్జున, నాగేశ్వర, రైల్వేకోడూరు మండల కన్వీనర్‌ సుధాకర్‌రాజు, డీఎస్పీ సుబ్బారావు, శ్రీనివాసులరెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top