చంద్రబాబు రాక్షస పాలన

బాబు పాల‌న‌లో బ‌త‌క‌లేకున్నాం
జూపూడి(ఇబ్ర‌హీంప‌ట్నం): చ‌ంద్ర‌బాబు గ‌ద్దెనెక్కి రెండేళ్లు దాటినా ఇంత‌వ‌ర‌కు పేద‌ల‌కు ఒరిగింది శూన్య‌మ‌ని, గుక్కెడు బువ్వ కోసం రెక్క‌లు ముక్క‌లు చేసుకోవాల్సి వ‌స్తుంద‌ని వైయ‌స్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి జోగి ర‌మేష్ వ‌ద్ద మ‌హిళ‌లు వాపోయారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న మండ‌ల ప‌రిధిలోని జూపూడిలో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.... చంద్ర‌బాబు పాల‌న మొత్తం ప్ర‌జావ్య‌తిరేకంగా కొన‌సాగుతుంద‌ని, ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ఫ‌లాలు అందాలంటే రాష్ట్రంలో వైయ‌స్సార్‌సీపీ అధికారంలోకి రావాల‌ని ఆయ‌న తెలిపారు. 

క‌ష్టాల జీవ‌నం
శ్రీ‌కాకుళం(మెళియాపుట్టి): అత్య‌వ‌స‌ర వేళ వైద్య‌సేవ‌లు అంద‌డం లేదు. వృద్దాప్యం ఆవ‌రించినా పింఛ‌న్లు మంజూరు కావ‌డం లేదు... రెండున్న‌రేళ్లుగా పూరిగుడిసెల్లో జీవిస్తున్నా ఇళ్లు నిర్మించే వారు క‌రువ‌య్యారు... రోడ్లు లేక కొండ రాళ్ల‌పైనే రాక‌పోక‌లు సాగిస్తున్నామంటూ ఆంపురం, పెంగువాడ‌, బంజీరు గ్రామ గిరిజ‌నులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా వైయ‌స్సార్‌సీపీ జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డిశాంతి ఆయా గ్రామాల్లో ప‌ర్య‌టించారు. అనంత‌రం వంద‌ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేసి బాబు పాల‌న‌పై మార్కులు వేయించారు. 2019లో వైయ‌స్సార్‌సీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని వైయ‌స్సార్ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు కావాలంటే ఒక్క వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ద్వారానే సాధ్య‌మ‌న్నారు. 

అర్హుల‌కు అంద‌ని సంక్షేమ ప‌థ‌కాలు
శ్రీ‌కాకుళం(హ‌రిశ్చంద్ర‌పురం): గ‌త ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశామ‌న్న అక్క‌సుతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌న్మ‌భూమి క‌మిటీల పేరుతో అర్హుల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అంద‌కుండా చేస్తున్నార‌ని హ‌రిశ్చంద్ర‌పురానికి చెందిన ప‌లువురు బాధితులు వాపోయారు. టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గ అద‌న‌పు స‌మ‌న్వ‌య‌కర్త పేరాడ తిల‌క్ ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం కొన‌సాగింది. దివంగ‌త రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాల‌న‌లో స్వ‌ర్ణ‌యుగం చూశామ‌ని, ప్ర‌స్తుతం చంద్ర‌బాబు రాక్ష‌స పాల‌న సాగిస్తున్నార‌ని మండిప‌డ్డారు.
Back to Top