నయవంచక పాలన

నమ్మించి మోసం చేశారు
విజయనగరం(కురుపాం))ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి శత్రుచర్ల పరీక్షీత్ రాజు ఆధ్వర్యంలో కొమరాడ మండలం కొట్టు గ్రామంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి బాబు మోసాలను ఎండగట్టారు. నిరుద్యోగభృతి, డ్వాక్రా రుణాలు సహా బాబు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలపై ప్రజలకు కరపత్రం అందించారు. అమలు అవుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఏవీ అమలు కావడం లేదని, బాబు తమను మోసం చేశాడని ప్రజలు వాపోయారు. అబద్ధపు హామీలతో వంచించిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

రాష్ట్రాన్ని గాలికొదిలేశారు
కర్నూలు(పాణ్యం))చంద్రబాబు ప్రజాసమస్యలను గాలికొదిలి విమానాలెక్కి దేశాలు పట్టుకు తిరుగుతున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మండిపడ్డారు. కల్లూరు అర్బన్‌ పరిధి 21వ వార్డు శ్యామలానగర్‌లో గడపగడపకు వైయస్సార్‌సీపీ కార్యక్రమం నిర్వహించారు. వార్డు ఇన్‌చార్జి కేవీ భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కాలనీవాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయించాలని ఎమ్మెల్యేను కోరారు. అంతేకాకుండా కలుషిత నీరు కలుస్తున్న వాల్వ్‌ వద్ద చర్యలు తీసుకోవాలని కోరగా ఎమ్మెల్యే వాటర్‌ వర్క్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రఫీక్‌ను ఫోన్‌ ద్వారా ఆదేశించారు. విద్యుత్‌ స్తంభం ఏర్పాటు చేయాలని వార్డు ప్రజలు కోరగా అందుకు వెంటనే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ చంద్రబాబు మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. 
 
Back to Top