అబద్ధపు హామీలతో మోసం

తూర్పుగోదావ‌రి: ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు అబ‌ద్ధ‌పు హామీలిచ్చి ప్ర‌జ‌ల‌ను మోస‌గించార‌ని ముమ్మిడివరం నియోజకవర్గం వెైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ విమ‌ర్శించారు. ముమ్మిడివ‌రం నగరపంచాయతీ 8వార్డులో పితాని బాల‌కృష్ణ ఆధ్వ‌ర్యంలో గడప గడపకు వెైయ‌స్ఆర్‌  కార్యక్రమం జరిగింది. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మోసాల‌పై ప్ర‌చురించిన ప్ర‌జాబ్యాలెట్‌ను ఇంటింటికి పంచుతూ బాబు పాల‌న‌ను ఎండ‌గ‌ట్టారు. 

జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గం కిర్లంపూడి మండ‌లం బుర్గుపూడి గ్రామంలో వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

తూర్పుగోదావ‌రి జిల్లా ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం రౌతుల‌పూడి మండ‌లం చ‌క్కిరేవుపాలెం, జ‌ల్దం గ్రామాల్లో పార్టీ నేత‌లు గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. 

తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ ప‌ట్ట‌ణంలోని 39వ డివిజ‌న్‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌ట్ట‌ణ కోఆర్డినేట‌ర్ ముత్తా శ‌శిధ‌ర్ ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.  
Back to Top