అబద్ధపు హామీలతో ప్రజలను వంచించిన చంద్రబాబు

తూర్పుగోదావ‌రి: చ‌ంద్ర‌బాబు ఎన్నిక‌ల ముందు అబ‌ద్ధ‌పు హామీలు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూ.గోదావ‌రి జిల్లా ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త పితాని బాల‌కృష్ణ విమ‌ర్శించారు. ముమ్మిడివ‌రం న‌గ‌ర పంచాయ‌తీ ప‌రిధిలోని 12వ వార్డులో పితాని బాల‌కృష్ణ ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌పకూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటికి తిరుగుతూ చంద్ర‌బాబు మోసాల‌ను వివ‌రిస్తూ,  ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేశారు. వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయితే మ‌ళ్లీ రాష్ట్రంలో రాజ‌న్న రాజ్యం వ‌స్తుంద‌న్నారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.


Back to Top