బాబుది దుర్మార్గ‌పు పాల‌న‌

ప్ర‌కాశంః అబ‌ద్ధ‌పు హామీల‌తో  గ‌ద్దెనెక్కిన చంద్ర‌బాబు రాష్ట్రంలో దుర్మార్గ‌పు పాల‌న‌ను కొన‌సాగిస్తున్నాడ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ బుర్రా మ‌ధుసూద‌న్ యాద‌వ్ విమ‌ర్శించారు. గురువారం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని పి.సి ప‌ల్లె మండ‌లం గుదేవారి పాలెం, బండ‌పాలెం, రామ‌పురం గ్రామాల్లో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయస్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మోస‌పు వాగ్ధానాల‌పై ప్ర‌చురించిన ప్ర‌జా బ్యాలెట్‌ను ఇంటింటికీ పంచుతూ బాబు పాల‌న‌పై మార్కులు వేయించారు. అనంత‌రం మ‌ధుసూద‌న్ యాద‌వ్ మాట్లాడుతూ.. రుణ‌మాఫీ అంటూ ఎన్నిక‌ల ముందు ఊద‌ర‌గొట్టిన చంద్ర‌బాబు రాష్ట్రానికి అన్నంపెట్టే రైతుకు అన్నం దొర‌క‌కుండా చేశాడ‌ని మండిప‌డ్డారు. నిరుద్యోగుల‌ను, డ్వాక్రా మ‌హిళ‌ల‌ను, ఉద్యోగుల‌ను, విద్యార్థుల‌ను ఇలా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను వంచించాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్న ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై కుట్ర‌పూరితంగా కేసులు పెడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.  బాబు చేతుల్లో మోస‌పోయిన ప్ర‌జానికం టీడీపీకి రాబోయే ఎన్నిక‌ల్లో స‌రైన గుణ‌పాఠం చెప్పాల‌ని సూచించారు. బుర్రా మ‌ధుసూద‌న్ యాద‌వ్ వెంట మండ‌ల పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. 

కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో
రాష్ట్ర రాజ‌ధాని పేరుతో చంద్ర‌బాబు అర‌చేతిలో వైకుంఠం చూపిస్తున్నార‌ని కందుకూరు నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్ సీపీ ఇన్‌చార్జ్ తూమాటి మాధ‌వ‌రావు విమ‌ర్శించారు. కందుకూరు మండ‌ల ప‌రిధిలోని పాలురు గ్రామంలో గురువారం గ‌డ‌ప గ‌డ‌ప‌కై వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కూ తిరుగుతూ చంద్ర‌బాబు అవినీతి ప‌రిపాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలు కేవ‌లం జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రం స‌స్య‌శ్యామ‌లం కావాలంటే వైయ‌స్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేసుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. కార్య‌క్ర‌మంలో కందుకూరు పార్టీ యూత్ అధ్య‌క్షులు పొడ‌పాటి కోటేశ్వ‌ర‌రావు, గంగిరెడ్డి, రాఘ‌వ‌రెడ్డి, వెంక‌ట్‌రామిరెడ్డి, సుభాని త‌దిత‌రులు పాల్గొన్నారు. 
Back to Top