దోమలకు మందు కొట్టారా..?మీరు మందు కొట్టి పడుకున్నారా..?

తిరుపతిః చంద్రబాబు ఏ ఒక్క పని సరిగా చేయకుండా కేవలం ప్రచార ఆర్బాటంతోనే కాలం వెల్లబుచ్చుతున్నాడని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ఉన్న ఊర్లకు దిక్కులేదు.. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తాడట అని బాబు పనితీరును ఎండగట్టారు. అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి నగరంలో బాబు పాలన నిర్వాకం కారణంగా 42 మురికి వాడలు ఏర్పడ్డాయని తెలిపారు. బాబు గత పాలనలో తిరుపతి చుట్టుపక్కల ఉన్న 47 కు పైగా చెరువులు కబ్జాకు గురవడంతో...భూగర్భజలాలు అడుగంటిపోయి ప్రజలకు నీళ్లు అందని దుస్థితి నెలకొందన్నారు. తిరుపతిలో నీటి ఎధ్దడిపై ప్రజలు ఫిర్యాదు చేస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. ప్రజల దాహార్తిని తీర్చేలా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతిలోని జియాగుడ ప్రాంతంలో భూమన పార్టీ నేతలతో కలిసి గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 


దోమలబెడతో ప్రజలు రోగాల బారిన పడుతుంటే ఏం చేస్తున్నారని పాలకులను ప్రశ్నించారు. దోమలకు మందు కొట్టారా మీరు మందు కొట్టి పడుకున్నారా అని టీడీపీ నాయకులపై ధ్వజమెత్తారు.  వీధికో బెల్టు షాపు పెట్టి చంద్రబాబు ప్రజలను మందుబాబులుగా మార్చారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైయస్సార్సీపీ ప్రభుత్వం మీద యుద్దం ప్రకటించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
Back to Top