ప్రజల దీవెనలే వైయస్సార్సీపీకి కొండంత బలం

అలసట లేని పోరాటం మాది
జగ్గంపేట‌)) రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. అల‌స‌ట‌లేని పోరాటం మాది, ప్ర‌జ‌ల దీవెన‌లే మా బ‌లం అంటూ వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గడపగడపలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా  జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గం, గండ‌ప‌ల్లె మండ‌లం, సూరాంపాళెంలో వైయస్సార్సీపీ నాయకులు గడపగడపకూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉన్న పెంన్ష‌న్ల‌ను ఊడ‌గొడుతున్నార‌ని, వేలిముద్ర‌ల సాకుతో రేష‌న్ స‌రుకులు రానివ్వ‌కుండా చేస్తున్నార‌ని ప్ర‌జ‌లు త‌మ‌గోడును వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కుల ద‌గ్గ‌ర విన్న‌వించుకుంటున్నారు. అధైర్యపడొద్దని, జగనన్నను ముఖ్యమంత్రి చేసుకొని కష్టాలను పారదోలుదామని నేతలు ప్రజలకు భరోసానిచ్చారు. 

విందులు, వినోదాలతో బాబు కాలక్షేపం
య‌ల‌మంచిలి))చంద్ర‌బాబుకు రాష్ట్రంలో అమ‌రావ‌తి త‌ప్ప ఇంకేమీ క‌నిపించ‌డం లేద‌ని వైయస్ఆర్ సీపీ యలమంచిలి నియోజకవర్గం క‌న్వీన‌ర్ ప్రగడ నాగేశ్వర రావు అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న యలమంచిలి మండలం రామరాయుడుపాలెం గ్రామంలో ప‌ర్య‌టించారు. రాష్ట్ర ప్ర‌జ‌లు విల‌విల్లాడుతుంటే చంద్ర‌బాబు మాత్రం విదేశాలు, విందుల‌తో హాయిగా ఉన్నారు అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రామ‌రాజ్యం తీసుకురావ‌డానికి వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అవిశ్రాంత‌గా శ్ర‌మిస్తున్నార‌ని అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌కు వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం మాలో ఎంతో ఆత్మ‌విశ్వాసం కిలిగించిందని ఆయ‌న సంతృప్తి తెలియ‌జేశారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌కర్త‌లు పాల్గొన్నారు.

బాబు పాలనను ఛీ కొడుతున్నారు
య‌ర్ర‌గొండ‌పాలెం))ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్ సీఎం కావాల‌ని ఆకాంక్షిస్తున్నార‌ని య‌ర్ర‌గొండ‌పాలెం వైయ‌స్ఆర్ సీపీ నాయకులు అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మంలో భాగంగా ప్రకాశం జిల్లా య‌ర‌గొండ‌పాలెం నియోజ‌క‌వ‌ర్గం, పెద్ద‌ర‌వీడు మండ‌లం, సుంకేశుల గ్రామంలో ప‌ర్య‌టించారు. ప్ర‌భుత్వానికి ప్ర‌జల మ‌నోభావాలు ప‌ట్ట‌డం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్ర‌బాబు పాల‌న‌ను అంద‌రూ ఛీ కొడుతున్నార‌ని తెలిపారు. కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌తిగ‌డ‌ప‌లో క‌ర‌ప‌త్రాలు పంపిణి చేశారు. ప్ర‌భుత్వ ప‌నితీరుకు మార్కులు వేయాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. 

Back to Top