అధికార దాహంతో నయవంచన

విజయనగరంః

రాష్ట్రంలో ప్రజాహిత పథకాల అమలు వైయస్సార్సీపీతోనే సాధ్యమని కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అన్నారు. ఏగులవాడ పంచాయతీలో ఆమె గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ ఏవిధంగా విస్మరించిందో ప్రజాబ్యాలెట్ ద్వారా వినిపించారు.  అధికార దాహం కోసం ఇంటికో ఉద్యోగం, రుణమాఫీ సహా అనేక హామీలిచ్చిన బాబు... ఏఒక్కటి నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్యే అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని  స్థానికులకు భరోసా ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో బాబుకు తగిన బుద్ధి చెప్పాలని పుష్పశ్రీవాణి ప్రజలకు పిలుపునిచ్చారు.


Back to Top