న‌మ్మించి మోసం చేసిన చంద్ర‌బాబు

శ్రీ‌కాకుళం: ఎన్నిక‌ల‌కు ముందు అమ‌లుకు సాధ్యంకాని హామీలు గుప్పించి, అధికారంలోకి వ‌చ్చాక ఏ ఒక్క హామీ అమ‌లు చేయ‌కుండా సీఎం చంద్ర‌బాబు రైతులు, మ‌హిళ‌లు, యువ‌కుల‌ను న‌మ్మించి మోసం చేశాడ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ‌కాకుళం జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డిశాంతి మండిప‌డ్డారు. శ‌నివారం జిల్లాలోని హీరా మండ‌లం అక్క‌ర‌ప‌ల్లి పంచాయ‌తీలో ఆమె గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మంలో పాల్గొని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీ రూపొందించిన ప్ర‌జాబ్యాలెట్ పంపిణీ చేశారు. రెండేళ్ల‌లో ప్ర‌జా ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని, వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అవుతార‌ని రెడ్డిశాంతి చెప్పారు. అదేవిధంగా పాల‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలోని లివిరి గ్రామంలో నిర్వ‌హించిన గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే విశ్వ‌స‌రాయి క‌ళావ‌తి, పార్టీ జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డిశాంతి పాల్గొన్నారు. 


Back to Top