రాక్షసరాజ్యాన్ని తలపిస్తోన్న బాబు పాలన

కర్నూలు(పాణ్యం))వైయస్ఆర్ పాలన రామరాజ్యాన్ని తలపిస్తే నేడు చంద్రబాబు పాలన రాక్షసరాజ్యాన్ని తలపిస్తోందని మహిళలు మండిపడ్డారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఓర్వకల్లు మండలంలో వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి గ్రామాల్లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నోట్ల రద్దుతో వ్యవసాయ పనుల్లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మురుగు నీటి కారణంగా అనారోగ్యం పాలవుతున్నామని కొమరోలు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వీధిలైట్లు లేక పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ...వైయస్ఆర్ హయాంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందేవని, బాబు వచ్చాక ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. మోసకారి ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు.


Back to Top