చంద్ర‌బాబుకు సున్నా మార్కులే

శ్రీ‌కాకుళంః చంద్ర‌బాబు ప‌రిపాల‌న‌కు ప్ర‌జ‌లంతా సున్నా మార్కులే వేస్తున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ‌కాకుళం జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డి శాంతి ఎద్దేవా చేశారు. ఎన్నిక‌ల హామీలు అమ‌లు చేయ‌లేని చంద్ర‌బాబుపై ప్ర‌జలంతా ఆగ్ర‌హంతో ఉన్నార‌ని చెప్పారు. పాత‌ప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం పాతప‌ట్నం మండ‌లం గంగువాడ గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలో రెడ్డి శాంతి గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటికి తిరుగుతూ చంద్ర‌బాబు ప‌రిపాల‌న‌పై మార్కులు వేయించారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌కర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. Back to Top