బాబు నిర్లక్ష్యం సీమ ప్రాజెక్ట్ లకు శాపంగా మారింది

ఉరవకొండ(అనంతపురం)గ్రామంలో ఉపాధి పనులు కల్పించలేదని, అర్హులకు రేషన్, పింఛన్లు, గృహాలు ఏవీ ఇవ్వడం లేదని శీర్పి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి బెళుగుప్ప మండలం శీర్పి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను మొరపెట్టుకన్నారు. చంద్రబాబు గతంలో పాదయాత్ర చేసినప్పుడు మా గుడిసెలో ఉన్న రంధ్రాలను చూసి పక్కా గృహం ఇస్తానని చెప్పాడని, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా ఇళ్లు ఇవ్వడం లేదని వన్నూరమ్మ వాపోయారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా బాబు ప్రజలను దారణంగా వంచించారని విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు నిర్లక్ష్యం రాయలసీమ ప్రాజెక్ట్ లకు శాపంగా మారిందని అన్నారు. శ్రీశైలం నిండా నీళ్లున్నా బాబు నిర్లక్ష్యం వల్ల అనంతపురం కరువు కోరల్లో చిక్కుకుందని అన్నారు. 

చంద్రబాబు గతంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా  ఉన్నప్పుడు హంద్రీనీవా, పోతిరెడ్డి పాడు, గాలేరు నగరి, వెలిగొండ ఏ ఒక్కటి ముట్టుకున్న పాపాన పోలేదని విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు.  బాబు ఆనాడు నిర్లక్ష్యం చేయకుంటే మన హక్కులు మనకు వచ్చేవన్నారు. ఇతరుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడుతూ నీళ్లు అడుక్కునే పరిస్థితిని తీసుకొచ్చారని బాబుపై ధ్వజమెత్తారు.  పట్టిసీమ పేరుతో ఆర్భాటం చేస్తున్నారు తప్పితే...రాయలసీమకు నీళ్లిస్తామని ఎక్కడ జీవోలో పేర్కొనలేదని దుయ్యబట్టారు. రాబోయే కాలంలో ప్రాజెక్ట్ లపై అనంతపురంలో పోరాటం చేస్తామన్నారు. ఇందుకు  ఉరవకొండలో నాయకత్వం వచించాలని తమ అధినేత వైయస్ జగన్ ను కోరడం జరిగిందని విశ్వశ్వర్ రెడ్డి చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top