రుణమాఫీ పేరుతో బాబు మోసం

మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
 బుట్టాయగూడెం: ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతులు, మహిళలను మోసం చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మండిపడ్డారు. బుట్టాయగూడెం మండలంలోని కోర్సవారిగూడెంలో గురువారం ఆయన గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పసుపు కుంకుమ అంటూ దాదాపు నెల రోజులుగా అధికారుల కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని, రుణమాఫీ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమా కావడం లేదని మహిళలు బాలరాజు దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్, గద్దే వీరకృష్ణ, నాయకులు ఆరేటి సత్యనారాయణ, మహిళా నాయకురాలు దాకే శ్రీదేవి, నాయకులు చోడెం బొజ్జి, కూరం వెంకటేశ్వరరావు, పూనెం కృష్ణ, పొడియం రాముడు, కుర్సం వెంకటస్వామి, కూరం చంద్రశేఖర్, కూరం లక్ష్మి, బన్ని పొట్టియ్య, పూనెం ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.
Back to Top