గడపగడపలో వైయస్సార్సీపీ శ్రేణులు
మోసకారి చంద్రబాబుపై ప్రజాగ్రహం
బనగానపల్లె))అంతులేని హామీలనిచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని బనగానపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ కాటసాని రామిరెడ్డి అన్నారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన అప్పలాపురం గ్రామంలో పర్యటించారు. గడపగడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. మూడేళ్ళ చంద్రబాబు పాలనతో విసిగి వేసారిపోయామని త్వరగా తమకు విముక్తి చేకూర్చాలని ప్రజలు తమ గోడును వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు వివరించారు. చంద్రబాబు అడ్డు అదుపు లేకుండా నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చాడని, కానీ వాటిని అమలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడని వైయస్ఆర్సీపీ నాయకులు అన్నారు. త్వరలోనే వైయస్ జగన్ పాలన వస్తుందని, మన కష్టాలన్నీ తీరిపోతాయని ప్రజలకు ధైర్యం చెప్పారు.
ఉన్నపెన్షన్లను ఊడగొడుతున్నారు
ఆదోని))సేవ చేయడం చేతగాని చంద్రబాబు వెంటే దిగిపోవాలి అని ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు మాటల మూటలు కుమ్మరించిన చంద్రబాబు చేతల్లో చేసింది మాత్రం శూన్యమని ఆయన విమర్శంచారు. గడపగడపకూ వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదోని నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామంలో పర్యటించారు. పెన్షన్ లను తీసేస్తున్నారని, పక్కా ఇళ్ల నిర్మాణం జాడే లేదని ప్రజలు ఆయన వద్ద విన్నవించారు. తాము అధికారంలోకి రాగానే అన్ని కష్టాలు తొలగిపోతాయని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రామరాజ్యం మళ్లీ రావాలి..
పాణ్యం))ప్రజలకు ఎల్లవేళలా మేమున్నామంటూ ధైర్యం చెప్పడానికే గడపగడపకు వైయస్ఆర్సీపీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పాణ్యం నియోజగకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆమె ముజాఫర్ నగర్ లో పర్యటించారు. కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ... ప్రజలు రాజన్న రామరాజ్యం కోరుకుంటున్నారని త్వరలోనే జగనన్న ప్రజల ఆశలు నెరవేరుస్తారని చెప్పారు. కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.