బాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు

కళ్లబొల్లి మాట‌ల‌తో ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి మోసం చేసిన వ్య‌క్తిగా చంద్ర‌బాబు చ‌రిత్ర‌హీనుడుగా మిగిలిపోతాడ‌ని క‌ర్నూలు జిల్లా పాణ్యం నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే గౌరు చ‌రితా రెడ్డి అన్నారు. గౌరు చ‌రితా రెడ్డి ఆధ్వ‌ర్యంలో ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్‌లో గురువారం గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. చంద్ర‌బాబుకు ఓటు వేసి న‌ట్టేటా మునిగిపోయామంటూ ప్ర‌జ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారని గౌరు చరితారెడ్డి తెలిపారు.

ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డ‌మే ధ్యేయంగా టీడీపీ ప‌ని చేస్తుంద‌ని బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గ అసెంబ్లీ ఇంచార్జీ కాట‌సాని రామిరెడ్డి అన్నారు.  రామిరెడ్డి ఆధ్వ‌ర్యంలో బ‌న‌గాన‌ప‌ల్లె మండ‌లం చిన్న‌రాజుపాలెం తండాలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... సుధీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న వ్య‌క్తిగా చంద్ర‌బాబును గెలిపించినందుకు త‌మ‌కు త‌గిన శాస్తి జ‌రిగింద‌ని ప్ర‌జ‌లు గొల్లుమంటున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

యువ‌కులు... మ‌హిళ‌లు... వృద్ధులు... ఉద్యోగులు... నిరుద్యోగులు... రైతులు... వ్యాపార నిర్వాహకులు ఇలా అన్ని వ‌ర్గాల వారిని చంద్ర‌బాబు పాల‌న గురించి అడిగితే సున్న మార్కులే వేస్తున్నార‌ని గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి అన్నారు. గురువారం మంగ‌ళ‌గిరి మండ‌లం నిడ‌మ‌ర్రు గ్రామంలో ఆర్కే ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. 

విశాఖ జిల్లా అరకు నియోజకవర్గ సమన్వయకర్త అరుణకుమారి, జిల్లా అధికార ప్రతినిధి శెట్టి అప్పాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు గడపగడపలో పర్యటించారు. డుంబ్రిగూడ మండలం క్రించునంద పంచాయతి లో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు, చోడవరం సమన్వయ కర్త  కరణం ధర్మశ్రీ మాడుగుల మండలం అంకుపాలెంలో గడప గడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ బాబు రాష్ట్ర ప్రజానీకాన్ని గాలికొదిలేశారని ఈసదంర్భంగా వారు ఫైర్ అయ్యారు. Back to Top