బాబు ఆరోగ్యశ్రీని నీరుగారుస్తున్నారు

నంద్యాల))నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడం కోసం దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు నీరుగారుస్తున్నారని నంద్యాల నియోజకవర్గ ఇంచార్జ్ రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయించకుండా పేదలకు వైద్యం అందకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నాపురంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి బాబు మోసపూరిత పాలనను ఎండగట్టారు. ఈ సందర్భంగా ప్రజలు సీసీరోడ్లు, మురుగు కాల్వలు ఏర్పాటు చేయాలని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని రాజగోపాల్ రెడ్డికి విన్నవించారు. గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమానికి వస్తున్న ప్రజల ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నేతలు అవాంతరాలు సృష్టిస్తున్నారని, దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.


Back to Top