నమ్మినందుకు నట్టేట ముంచిన బాబు

దగాకోరు చంద్రబాబు

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించి బాబు అంద‌రినీ నిండా ముంచాడ‌ని క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జీ చెరుకుల‌పాడు ల‌క్ష్మీ నారాయ‌ణ‌రెడ్డి మండిపడ్డారు.  ప‌త్త‌కొండ మండ‌లం కొత్త‌ప‌ల్లి, పందికోన గ్రామాల్లో గడ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. చంద్ర‌బాబు ఇంత ద‌గా చేస్తాడ‌నుకోలేదని ప్ర‌జ‌లు ఆవేదన వ్యక్తం చేశారు. తమను మోసం చేసిన టీడీపీకి రానున్న ఎన్నికల్లో గట్టి బుద్ది చెబుతామని హెచ్చరించారు.


టీడీపీ పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలే
ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించి నెల‌లు గ‌డుస్తున్నా రేష‌న్‌కార్డులు ఇవ్వ‌డం లేదు.. కార్యాల‌యాల చుట్టూ కాళ్ల‌రిగేలా తిరిగినా పింఛ‌న్లు మంజూరు చేయ‌డం లేదు. టీడీపీ పాల‌న‌లో ప్రజలు అడుగ‌డుగునా క‌ష్టాలు ప‌డుతున్నార‌ని సూళ్లురుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవ‌య్య అన్నారు. వైయ‌స్సార్‌సీపీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు షేక్ ర‌ఫీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వెంక‌టేశ్వ‌ర‌పురం, రామ‌కృష్ణ‌న‌గ‌ర్‌, అర్ముగంన‌గ‌ర్‌లో ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌లకు ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేశారు. ఈసందర్భంగా బాబు పాలనకు ప్రజలు ఒక్క మార్కు కూడా వేయలేదు. 

డ్వాక్రా రుణమాఫీ బూట‌కం
నా పేరు ఎన్‌. స‌త్య‌వ‌తి.... ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు డ్వాక్రా రుణ‌మాఫీ చేస్తానంటే నిజ‌మ‌ని న‌మ్మాను. ఓటు వేశాను. ఇప్పుడు బాబు అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు అవుతుంది. నాకు ఇప్ప‌టికీ డ్వాక్రా రుణ‌మాఫీ కాలేదు. ఇప్ప‌టికి ఇంకా ఆ అప్పు అలాగే ఉంది. మా తిప్ప‌లు మేం ప‌డాల్సి వ‌స్తుంద‌ని మండ‌పేట నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ వేగుళ్ల ప‌ట్టాభిరామ‌య్య ఎదుట త‌న గోడు వెళ్ల‌బోసుకుంది.  ప‌ట్టాభిరామ‌య్య ఆధ్వ‌ర్యంలో ప‌ట్ట‌ణంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. 

ప్రజల బాధలు పట్టని సర్కార్
తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణం  8, 9వ వార్డుల్లో నియోజకవర్గ కో ఆర్డినేటర్ వేగుళ్ళ లీలాకృష్ణ , పాపారాయుడు గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టారు.  రేషన్, పెన్షన్ అందడం లేదు.  హౌసింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ లేనందు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం.  డ్రైనేజీ, తాగునీరు సరిగా లేక  అవస్థలు పడుతున్నామని ప్రజలు వాపోయారు. చంద్రబాబుకు ప్రజల బాధలే పట్టడం లేదని లీలాకృష్ణ మండిపడ్డారు.Back to Top