బాబువి మాటలే తప్ప చేతలు శూన్యం

ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది
శ్రీకాకుళం(నరసన్నపేట)) బాబు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా...ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయిందని వైయస్సార్సీపీ నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే ధర్మాన క్రిష్ణదాస్ మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని అన్నారు. ధర్మాన నరసన్నపేటలో  గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గడపగడపకూ వెళ్లి ప్రజల సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. అబద్ధపు హామీలతో మోసపుచ్చిన బాబు పాలనపై ప్రజలు మండిపడ్డారు. 

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
విశాఖ(యలమంచిలి)) చంద్రబాబు వచ్చాక ఎక్కడా కూడా అభివృద్ధి పనులు జరగడం లేదు. రోడ్లు, డ్రైనేజులు అధ్వాన్నంగా ఉన్నాయి. రుణమాఫీ,ఇంటికో ఉద్యోగం ఏ ఒక్క హామీని బాబు నెరవేర్చడం లేదు. బాబుది మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని విశాఖ జిల్లా సేకులపాలెం గ్రామస్తులు అన్నారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా యలమంచిలి నియోజకవర్గం కన్వీనర్ ప్రగడ నాగేశ్వర రావు సేకులపాలెంలో పర్యటించారు. ఈసందర్భంగా ప్రగడ మాట్లాడుతూ..బాబు చేసిన మోసం వల్ల ప్రతీ కుటుంబం అవస్థలు పడుతోందన్నారు. ప్రజలు బాబుకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 

సమస్యలు ఏకరువు పెట్టిన గిరిజనం
విశాఖ(అరకు)) పెదబయలు మండలంలో ని సీతగుంట, ముసిడి పుట్టు తదితర గ్రామాలలో అరకు సమన్వయకర్త అరుణకుమారి,  అధికార ప్రతినిధి శెట్టి అప్పాలు తదితరులు గడపగడపలో పర్యటించారు. ఈసందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని, తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.  ప్రజాబ్యాలెట్ లో బాబుకు గిరిజనం సున్నా మార్కులు వేశారు. మరోవైపు, అరకువేలి హుకుంపేట మండలం అడ్డుమండ గ్రామం  ఏజన్సీ ప్రాంతంలో డయేరియాతో చనిపోయిన కుటుంబాలకిబియ్యం, పప్పు ఇచ్చి సహాయం అందించారు. తాజా ఫోటోలు

Back to Top