బతుకులు బాగుపడాలంటే బాబును సాగనంపాల్సిందే

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజలకు కొండంత అండగా నిలుస్తూ వైయస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రతీ గడపలో వైయస్సార్సీపీ శ్రేణులకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈసందర్భంగా బాబు చేసిన మోసాలను తమ నాయకులకు చెప్పుకొని వాపోతున్నారు.

ఎన్నికల్లో వందలాది వాగ్ధానాలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా తమను మోసం చేశారని ప్రతీ గడప కన్నీరుపెడుతోంది. రైతులు, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇలా ప్రతీ ఒక్కరిది అరణ్య రోదనే.  రుణమాఫీ చేస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగభృతి ఇస్తాం, ఇళ్లు కట్టిస్తాం అంటూ బాబు మాయమాటలతో నమ్మించి ఓట్లు వేయించుకొని నిండా ముంచాడని ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో టీడీపీ పార్టీనే లేకండా చేస్తామని హెచ్చరిస్తున్నారు. అధికారం కోసం అమలుగానీ హామీలిచ్చిన చంద్రబాబు అవి నెరవేర్చలేకుండా  ప్రజలను నానా అవస్థలకు గురిచేస్తున్నారని వైయస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఇంటింటికి వెళ్లి మేమున్నామంటూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకుందామని వారిలో ధైర్యం కల్పిస్తున్నారు. వైయస్ జగన్ ను సీఎం చేసుకొని జీవితాలను బాగుపర్చుకుందామని పిలుపునిస్తున్నారు. అవినీతి, అక్రమాలే ధ్యేయంగా పాలన సాగిస్తున్న బాబును సాగనంపుదామని అన్నారు. 


Back to Top