బాబు పాలనంతా గుండు సున్నా

రాష్ట్రవ్యాప్తంగా గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం మహోద్యమంలా కొనసాగుతోంది. గడపగడపలో వైయస్సార్సీపీ శ్రేణులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బొట్టుపెట్టి హారతిచ్చి నీరాజనం పడుతున్నారు. తమ కష్టాలను తెలుసుకునేందుకు వచ్చిన వైయస్సార్సీపీ నాయకులకు సమస్యలు చెప్పుకొని ఆవేదన చెందుతున్నారు.  టీడీపీకి ఓట్లు వేసి మోసపోయామని  మొరపెట్టుకుంటున్నారు. రుణమాఫీ కాలేదు. ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతి  లేదు. పింఛన్లు రావడం లేదు. రేషన్ సరుకులు సరిగా ఇవ్వడం లేదు. ఏ ఇంట చూసినా అన్నీ సమస్యలే. అబద్ధపు హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబును రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని ప్రజలంతా ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబుకు సున్నా మార్కులు వేస్తున్నారు.  

ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మళ్లీ రాజన్న రాజ్యం రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. వైయస్సార్సీపీని గెలిపించుకుంటామని, వైయస్ జగన్ సీఎం అయితేనే తమ కష్టాలు తీరుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 

Back to Top